ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

2013లోని పోస్ట్‌లను చూపుతోంది

నరసింహ అవతార క్షేత్రం అహోబిలం

శ్రీమహావి­ష్ణువు అవతారమూర్తి. దుష్టశిక్షణ....శిష్ట రక్షణ కోసం ఆయన దాల్చిన అవతారాలు అనన్యం. ఆ దుష్టశిక్షణ కోసమే ఆయన రూపుదాల్చిన స్వరూపం నరసింహ స్వా­మి. హిరణ్యకశిపుని సంహారం కోసం నరసింహుడు అవతారం దాల్చిన ప్రదేశం అహోబిలం. నరసింహ స్వా­మి 9 రూపాల్లో కొలువై ఈ క్షేత్రాన మహిమలను చాటుతున్నారు. రతనాల రాయలసీమకు ముఖద్వారం, శ్రీశైలం, మహానంది వంటి ప్రసిద్ధ శైవ ప్రదేశాలతో ఆధ్యాత్మిక గుర్తింపు తెచ్చుకున్న జిల్లా కర్నూలు. ఈ కర్నూలు సిగలోని ప్రముఖ వైష్ణవ ప్రదేశం అహోబిలం. దేశంలోని నరసింహ క్షేత్రాల్లో ప్రత్యేకమైనదిగా అహోబిల క్షేత్రాన్ని పేర్కొంటారు. ఎగువ అహోబిలంలో నరసింహ స్వామి­ ఉగ్రనరసింహుడుగా, దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరద నరసింహుడుగా కొలువై ఉన్నారు. దీనితో పాటు ఈ ఆలయ పరిసరాల్లో స్వా­మి మొత్తం 9రూపాల్లో కొలువై ఉన్నారు. జ్వాలా, భార్గవ, యోగానంద, ఛత్రవట, పావన, కారంజ, క్రోడ, మాలోల, ప్రహ్లాద వరద నరసింహ స్వామిగా ఇక్కడ స్వా­మి దర్శన­మిస్తారు. అవతరించిన ప్రదేశం ఇదే హరినామమే కడు ఆనందకరమూ అని ప్రతి నిత్యం శ్రీమహావి­ష్ణువు ధ్యానంలో గడిపే బాల భక్తుడు ప్రహ్లాదుడు. శాప ప్రభావం వల్ల రాక్షసునిగా జన్మించిన హిరణ్యకశిపుడ

కైలాస దర్శనం: మానసరోవర యాత్ర

సర్వజగత్తునూ నడిపించే లయకారుడు పరమ శివుడు. భక్తసులభుడిగా పేరు తెచ్చుకున్న ఆ భోళా శంకరుడి ఉండేది కైలాసంలో. హిమాలయాల్లోనే ఈ కైలాసం ఉందన్నది భక్తుల విశ్వాసం. ఆ పర్వతాన్ని దర్శించుకుంటే వచ్చే అనుభూతి మాటల్లో వర్ణించలేదని.. పదాలకు అంతుచిక్కనిది. ఒక్కసారి కైలాసగిరిని దర్శించుకుంటే.. సర్వపాపవిమోచనం కలుగుతుంది. అంత పవిత్రమైన స్థలం.. కైలాసపర్వతం. ఆ కైలాసం విశ్వాంతరాల్లోనో, పాతాళలోకంలోనే లేదు.. భూమిపైనే ఉంది. శివపార్వతులు అక్కడే కొలువై ఉన్నారు. ప్రమథగణాలతో ఈ లోకాన్ని పాలిస్తున్నారు. పరమపవిత్రమైన హిమాలయాల్లో.. దేవాదిదేవతలు కొలువైన మంచుకొండల మధ్యలో... ఈ భూలోక కైలాసం ఉంది. అదే.. హిమాలయ పర్వతాల్లోని కైలాస శిఖరం. కేవలం మహాశివుడు మాత్రమే కాదు.. అక్కడికి వెళితే మహాలక్ష్మితో సేవలందుకుంటూ పాలసముద్రంలో పవళించిన విష్ణుమూర్తి దర్శనమూ లభిస్తుంది. బ్రహ్మమనస్సు నుంచి ఉద్భవించిన పరమపవిత్రమైన సరోవరమూ ఇక్కడ ఉంది. దేవతలు స్నానమాచరించే, ఈ పవిత్ర జలాల్లో ఒక్క మునకేసినా... పాపలన్నీ నశించి.. ఎంతో పుణ్యాన్ని దక్కించుకున్నవారవుతారు. కైలాస పర్వతంపైనే మహాశివుడి నివాసం ఉందని పురాణాలు చెబుతున్నాయి. తరతరాలుగా భక్తుల నమ్మక