ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

guntur లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

అమరేశ్వర దేవస్థానం - అమరావతి

పావన కృష్ణవేణీ నదీ తీరపు పరవళ్లు, మదిని మైమరిపించే పరిసరాల మధ్య నెలవైన ఆధ్యాత్మిక ప్రదేశం అమరావతి. పరమేశ్వరుడు అమరలింగేశ్వరుడిగా కొలువై ఇక్కడ భక్తజనాన్ని దీవిస్తున్నాడు. ఇక్కడి స్వామిని అమరేశ్వరుడు, క్రౌంచనాథుడు అని కూడా అంటారు. రాష్ట్రంలో ఉన్న పంచారామ క్షేత్రాల్లో మొదటిది ఈ అమరావతి పుణ్యస్థలం. పంచారామ క్షేత్రాల్లోనే పరమపవిత్రమైనది అమరావతి. దాదాపు పదిహేను అడుగుల ఎత్తైన లింగరూపంలో కొలువై ఉండడం అమరలింగేశ్వరుని విశిష్టత. సుప్రసిద్ధ శైవప్రదేశంగా విరాజిల్లుతున్న అమరావతి క్షేత్రానికి విశిష్టమైన స్థల పురాణం ఉంది. క్షీరసాగర మథనం జరుగుతున్న సమయంలో ఆత్మలింగం ఉద్భవించింది. ఈ ఆత్మలింగాన్ని తారకాసురుడు అనే రాక్షసుడు మెడలో ధరించి శివు కోసం ఘోర తప్పస్సు చేయగా, పరమేశ్వరుడు ప్రత్యక్షమై అతనికి మరణం లేకుండా వరం ఇస్తాడు. అయితే, దేవతలపై యుద్ధం చేసే పక్షంలో తనపై గాని, తన సంతతిపై గాని దాడి చేస్తే ఖండఖండాలవుతాని శివుడు ఓ షరతు పెడతాడు. కాలక్రమంలో శివుని కుమారుడు కుమారస్వామితో, తారకాసురుడు తలపడగా, అతని తల ముక్కలుగానూ, అతని మెడలోని ఆత్మలింగం అయిదు ముక్కలుగానూ పగిలిపోతుంది. ఈ ఆత్మలింగ శకలాల్లో ఒకటి ఇంద్ర...