ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

నరసింహ అవతార క్షేత్రం అహోబిలం

శ్రీమహావి­ష్ణువు అవతారమూర్తి. దుష్టశిక్షణ....శిష్ట రక్షణ కోసం ఆయన దాల్చిన అవతారాలు అనన్యం. ఆ దుష్టశిక్షణ కోసమే ఆయన రూపుదాల్చిన స్వరూపం నరసింహ స్వా­మి. హిరణ్యకశిపుని సంహారం కోసం నరసింహుడు అవతారం దాల్చిన ప్రదేశం అహోబిలం. నరసింహ స్వా­మి 9 రూపాల్లో కొలువై ఈ క్షేత్రాన మహిమలను చాటుతున్నారు. రతనాల రాయలసీమకు ముఖద్వారం, శ్రీశైలం, మహానంది వంటి ప్రసిద్ధ శైవ ప్రదేశాలతో ఆధ్యాత్మిక గుర్తింపు తెచ్చుకున్న జిల్లా కర్నూలు. ఈ కర్నూలు సిగలోని ప్రముఖ వైష్ణవ ప్రదేశం అహోబిలం. దేశంలోని నరసింహ క్షేత్రాల్లో ప్రత్యేకమైనదిగా అహోబిల క్షేత్రాన్ని పేర్కొంటారు. ఎగువ అహోబిలంలో నరసింహ స్వామి­ ఉగ్రనరసింహుడుగా, దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరద నరసింహుడుగా కొలువై ఉన్నారు. దీనితో పాటు ఈ ఆలయ పరిసరాల్లో స్వా­మి మొత్తం 9రూపాల్లో కొలువై ఉన్నారు. జ్వాలా, భార్గవ, యోగానంద, ఛత్రవట, పావన, కారంజ, క్రోడ, మాలోల, ప్రహ్లాద వరద నరసింహ స్వామిగా ఇక్కడ స్వా­మి దర్శన­మిస్తారు. అవతరించిన ప్రదేశం ఇదే హరినామమే కడు ఆనందకరమూ అని ప్రతి నిత్యం శ్రీమహావి­ష్ణువు ధ్యానంలో గడిపే బాల భక్తుడు ప్రహ్లాదుడు. శాప ప్రభావం వల్ల రాక్షసునిగా జన్మించిన హిరణ్యకశిపుడ
ఇటీవలి పోస్ట్‌లు

కైలాస దర్శనం: మానసరోవర యాత్ర

సర్వజగత్తునూ నడిపించే లయకారుడు పరమ శివుడు. భక్తసులభుడిగా పేరు తెచ్చుకున్న ఆ భోళా శంకరుడి ఉండేది కైలాసంలో. హిమాలయాల్లోనే ఈ కైలాసం ఉందన్నది భక్తుల విశ్వాసం. ఆ పర్వతాన్ని దర్శించుకుంటే వచ్చే అనుభూతి మాటల్లో వర్ణించలేదని.. పదాలకు అంతుచిక్కనిది. ఒక్కసారి కైలాసగిరిని దర్శించుకుంటే.. సర్వపాపవిమోచనం కలుగుతుంది. అంత పవిత్రమైన స్థలం.. కైలాసపర్వతం. ఆ కైలాసం విశ్వాంతరాల్లోనో, పాతాళలోకంలోనే లేదు.. భూమిపైనే ఉంది. శివపార్వతులు అక్కడే కొలువై ఉన్నారు. ప్రమథగణాలతో ఈ లోకాన్ని పాలిస్తున్నారు. పరమపవిత్రమైన హిమాలయాల్లో.. దేవాదిదేవతలు కొలువైన మంచుకొండల మధ్యలో... ఈ భూలోక కైలాసం ఉంది. అదే.. హిమాలయ పర్వతాల్లోని కైలాస శిఖరం. కేవలం మహాశివుడు మాత్రమే కాదు.. అక్కడికి వెళితే మహాలక్ష్మితో సేవలందుకుంటూ పాలసముద్రంలో పవళించిన విష్ణుమూర్తి దర్శనమూ లభిస్తుంది. బ్రహ్మమనస్సు నుంచి ఉద్భవించిన పరమపవిత్రమైన సరోవరమూ ఇక్కడ ఉంది. దేవతలు స్నానమాచరించే, ఈ పవిత్ర జలాల్లో ఒక్క మునకేసినా... పాపలన్నీ నశించి.. ఎంతో పుణ్యాన్ని దక్కించుకున్నవారవుతారు. కైలాస పర్వతంపైనే మహాశివుడి నివాసం ఉందని పురాణాలు చెబుతున్నాయి. తరతరాలుగా భక్తుల నమ్మక

అమ్మపల్లి కోదండరామాలయం

పితృవాక్యపరిపాలన, సత్పరివర్తన, సత్పాలన అన్నీ కలిస్తే శ్రీరాముడు. తరతరాలకూ ఆదర్శపురుషుడు. సీతారాముడిగా హైదరాబాద్లోని శంషాబాద్ సమీపంలో దర్శనమిస్తున్నాడు. వందల ఏళ్లనాటి ఈ ఆలయమే.. అమ్మపల్లి కోదండరామాలయం. ఆలయ చరిత్ర     ఆకాశాన్నంటుతున్నట్లుండే గాలిగోపురం, విశాలమైన మండపాలు, ఆహ్లాదపరిచే ప్రకృతిఅందాలు, అమ్మపల్లి కోదండరామస్వామి సన్నిధికి వచ్చే భక్తుల మనసును ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఆహ్వానం పలుకుతాయి. ఆధ్యాత్మిక, ఆహ్లాద అనుభూతిని పంచుతున్న ఈ ఆలయం చరిత్రకు అందని కాలం నుంచే ఇక్కడ కొలువై ఉంది. పూర్వకాలంలో అమ్మపల్లి పరిసర గ్రామాల్లో ప్లేగు వ్యాధి సోకి అనేకమంది ప్రాణాలు కోల్పోయారట. గ్రామంలో రామాలయం నిర్మిస్తే వ్యాధి నయం అవుతుందని కొందరు మహాత్ములు అక్కడికి వారికి ఆ సమయంలో సూచించారట. అప్పుడే ఆలయం నిర్మితమయ్యింది. ఇథమిత్థంగా ఏ కాలంలో జరిగిందన్నది చెప్పలేకున్నా, 14వ శతాబ్ధానికి చెందిన ఆలయంగా ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. ప్రత్యేకత ఏకశిలపై సీతాసమేతుడై శ్రీరాముడు ఇక్కడ దర్శనమిస్తాడు.ఇదే శిలపై శ్రీ మహావిష్ణువు దశావతారాలు కూడా దర్శనమిస్తాయి. స్వామిని దర్శిస్తే.. ప్లేగు వ్యాధినుంచి విముక్తి కలిగించిన అమ్మ

అంతర్వేది నరసింహస్వామి

కోనసీమ అందాలు, పావన గోదావరీ గలగలలతో అలరారుతూ ప్రాకృతిక సౌందర్యం కొలువైన జిల్లా తూర్పుగోదావరి జిల్లా. కోస్తాంధ్రకు కీలకస్థానమైన ఈ జిల్లాకు ఆధ్యాత్మిక గుర్తింపు తెచ్చిన దేవస్థానం అంతర్వేది లక్ష్మీనరసింహాలయం. నరసింహుని రూపం ఉగ్రరూపం. మృగరాజైన సింహం తలతో ప్రళయభీకరంగా కనిపించినా, భక్తుల పాలిట మాత్రం మనసున్న దేవుడే. భక్త సులభుడని పేరున్న శ్రీ మహావిష్ణువు దశావతార స్వరూపమే నరసింహావతారం. దేవదేవుడైన మహావిష్ణవు లోకకళ్యాణం కోసం దశవతారాలను దాల్చగా, అందులో నాలుగో అవతారం నారసింహావతారం. ఆలయ విశిష్టత బంగాళాఖాతం తీరాన కొలువైన క్షేత్రం అంతర్వేది. ప్రశాంత పరిసరాల్లో కొలువైన ఈ ఆలయాన్ని దర్శిస్తే మనసు కూడా అంతే ప్రశాంతంగా మారుతుందట. ఎన్ని సమస్యలతో ఈ క్షేత్రంలో అడుగుపెట్టినా, అన్నీ దూరమైన అనుభూతి ప్రసాదిస్తాడని అంతర్వేది నరసింహస్వామికి పేరు. కోరమీసాలవాడు అంతర్వేది నారసింహుడు. కోరమీసాలు.. వీరత్వానికి ప్రతీక. అలాంటి ఈ స్వామిని మొక్కుకుంటే అనంత ధైర్యసాహసాలను ప్రసాదిస్తాడట. మానసిక ఆందోళనలతో బాధపడేవారు ఈయన మీద భారం వేసి కేవలం టెంకాయ సమర్పించినా, ధృడమైన మనసును ఇస్తాడని భక్తుల నమ్మకం. ఏదైనా ఇబ్బందితో బాధ

జోగులాంబ దేవాలయం - ఆలంపూర్

శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు అనేకం. ఆదిశక్తిగా, పరాశక్తిగా, జగన్మాతగా, లోకేశ్వరిగా విభిన్న రూపాల్లో పూజలందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి. శక్తికి రూపమైన ఆ తల్లి కొలువైన పరమ పవిత్ర దివ్యధామాలు అష్టాదశ శక్తి పీఠాలు. మహామహిమాన్వితమైన ఆ శక్తిపీఠాల్లో ఒకటి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్. జోగులాంబ ఇక్కడ కొలువైన అమ్మవారు భక్తులకు దర్శనిమస్తుంటారు. రాయలసీమ ముఖద్వారం కర్నూలుకు సమీపంలో, మహబూబ్ నగర్ జిల్లా శివారులో నెలవై ఉంది ఆలంపూర్ పట్టణం. ఆలయాల నగరంగా ప్రఖ్యాతి గాంచిన ఆలంపూర్ పట్టణసిగలో మణిముకటమై వెలసింది ఇక్కడి జోగులాంబ ఆలయం. పరమ పవిత్ర అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా, పావన తుంగభద్రా నది తీరాన, ఇక్కడ అమ్మవారు జోగులాంబగా వెలిసి భక్తులపై తన కరుణాకఠాక్షాలను చూపుతున్నారు. స్థల పురాణం అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం వెనుక పరమశివునితో కూడాన పురాణగాథ ప్రాచుర్యమంలో ఉంది. శివుని భార్య సతీదేవి తండ్రి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్లి అవమానాల పాలై, అక్కడే ప్రాణత్యాగం చేస్తుంది. భార్య మీద ప్రేమతో ఆమె మృతదేహాన్ని భుజాన ధరించి లోకసంచారం చేస్తుంటాడు. అదే సమయంలో శివ వర ప్రసాదంతో మృత్యువును జయ

అమరేశ్వర దేవస్థానం - అమరావతి

పావన కృష్ణవేణీ నదీ తీరపు పరవళ్లు, మదిని మైమరిపించే పరిసరాల మధ్య నెలవైన ఆధ్యాత్మిక ప్రదేశం అమరావతి. పరమేశ్వరుడు అమరలింగేశ్వరుడిగా కొలువై ఇక్కడ భక్తజనాన్ని దీవిస్తున్నాడు. ఇక్కడి స్వామిని అమరేశ్వరుడు, క్రౌంచనాథుడు అని కూడా అంటారు. రాష్ట్రంలో ఉన్న పంచారామ క్షేత్రాల్లో మొదటిది ఈ అమరావతి పుణ్యస్థలం. పంచారామ క్షేత్రాల్లోనే పరమపవిత్రమైనది అమరావతి. దాదాపు పదిహేను అడుగుల ఎత్తైన లింగరూపంలో కొలువై ఉండడం అమరలింగేశ్వరుని విశిష్టత. సుప్రసిద్ధ శైవప్రదేశంగా విరాజిల్లుతున్న అమరావతి క్షేత్రానికి విశిష్టమైన స్థల పురాణం ఉంది. క్షీరసాగర మథనం జరుగుతున్న సమయంలో ఆత్మలింగం ఉద్భవించింది. ఈ ఆత్మలింగాన్ని తారకాసురుడు అనే రాక్షసుడు మెడలో ధరించి శివు కోసం ఘోర తప్పస్సు చేయగా, పరమేశ్వరుడు ప్రత్యక్షమై అతనికి మరణం లేకుండా వరం ఇస్తాడు. అయితే, దేవతలపై యుద్ధం చేసే పక్షంలో తనపై గాని, తన సంతతిపై గాని దాడి చేస్తే ఖండఖండాలవుతాని శివుడు ఓ షరతు పెడతాడు. కాలక్రమంలో శివుని కుమారుడు కుమారస్వామితో, తారకాసురుడు తలపడగా, అతని తల ముక్కలుగానూ, అతని మెడలోని ఆత్మలింగం అయిదు ముక్కలుగానూ పగిలిపోతుంది. ఈ ఆత్మలింగ శకలాల్లో ఒకటి ఇంద్ర