ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

shiva లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

కైలాస దర్శనం: మానసరోవర యాత్ర

సర్వజగత్తునూ నడిపించే లయకారుడు పరమ శివుడు. భక్తసులభుడిగా పేరు తెచ్చుకున్న ఆ భోళా శంకరుడి ఉండేది కైలాసంలో. హిమాలయాల్లోనే ఈ కైలాసం ఉందన్నది భక్తుల విశ్వాసం. ఆ పర్వతాన్ని దర్శించుకుంటే వచ్చే అనుభూతి మాటల్లో వర్ణించలేదని.. పదాలకు అంతుచిక్కనిది. ఒక్కసారి కైలాసగిరిని దర్శించుకుంటే.. సర్వపాపవిమోచనం కలుగుతుంది. అంత పవిత్రమైన స్థలం.. కైలాసపర్వతం. ఆ కైలాసం విశ్వాంతరాల్లోనో, పాతాళలోకంలోనే లేదు.. భూమిపైనే ఉంది. శివపార్వతులు అక్కడే కొలువై ఉన్నారు. ప్రమథగణాలతో ఈ లోకాన్ని పాలిస్తున్నారు. పరమపవిత్రమైన హిమాలయాల్లో.. దేవాదిదేవతలు కొలువైన మంచుకొండల మధ్యలో... ఈ భూలోక కైలాసం ఉంది. అదే.. హిమాలయ పర్వతాల్లోని కైలాస శిఖరం. కేవలం మహాశివుడు మాత్రమే కాదు.. అక్కడికి వెళితే మహాలక్ష్మితో సేవలందుకుంటూ పాలసముద్రంలో పవళించిన విష్ణుమూర్తి దర్శనమూ లభిస్తుంది. బ్రహ్మమనస్సు నుంచి ఉద్భవించిన పరమపవిత్రమైన సరోవరమూ ఇక్కడ ఉంది. దేవతలు స్నానమాచరించే, ఈ పవిత్ర జలాల్లో ఒక్క మునకేసినా... పాపలన్నీ నశించి.. ఎంతో పుణ్యాన్ని దక్కించుకున్నవారవుతారు. కైలాస పర్వతంపైనే మహాశివుడి నివాసం ఉందని పురాణాలు చెబుతున్నాయి. తరతరాలుగా భక్తుల నమ్మక...

అమరేశ్వర దేవస్థానం - అమరావతి

పావన కృష్ణవేణీ నదీ తీరపు పరవళ్లు, మదిని మైమరిపించే పరిసరాల మధ్య నెలవైన ఆధ్యాత్మిక ప్రదేశం అమరావతి. పరమేశ్వరుడు అమరలింగేశ్వరుడిగా కొలువై ఇక్కడ భక్తజనాన్ని దీవిస్తున్నాడు. ఇక్కడి స్వామిని అమరేశ్వరుడు, క్రౌంచనాథుడు అని కూడా అంటారు. రాష్ట్రంలో ఉన్న పంచారామ క్షేత్రాల్లో మొదటిది ఈ అమరావతి పుణ్యస్థలం. పంచారామ క్షేత్రాల్లోనే పరమపవిత్రమైనది అమరావతి. దాదాపు పదిహేను అడుగుల ఎత్తైన లింగరూపంలో కొలువై ఉండడం అమరలింగేశ్వరుని విశిష్టత. సుప్రసిద్ధ శైవప్రదేశంగా విరాజిల్లుతున్న అమరావతి క్షేత్రానికి విశిష్టమైన స్థల పురాణం ఉంది. క్షీరసాగర మథనం జరుగుతున్న సమయంలో ఆత్మలింగం ఉద్భవించింది. ఈ ఆత్మలింగాన్ని తారకాసురుడు అనే రాక్షసుడు మెడలో ధరించి శివు కోసం ఘోర తప్పస్సు చేయగా, పరమేశ్వరుడు ప్రత్యక్షమై అతనికి మరణం లేకుండా వరం ఇస్తాడు. అయితే, దేవతలపై యుద్ధం చేసే పక్షంలో తనపై గాని, తన సంతతిపై గాని దాడి చేస్తే ఖండఖండాలవుతాని శివుడు ఓ షరతు పెడతాడు. కాలక్రమంలో శివుని కుమారుడు కుమారస్వామితో, తారకాసురుడు తలపడగా, అతని తల ముక్కలుగానూ, అతని మెడలోని ఆత్మలింగం అయిదు ముక్కలుగానూ పగిలిపోతుంది. ఈ ఆత్మలింగ శకలాల్లో ఒకటి ఇంద్ర...